కొత్త సారథ్యానికి ఇదే సమయం


Fri,March 15, 2019 11:14 AM

Let a new better leadership take over

-ఐదేండ్లలో మీడియా ముందుకు రాని ప్రధానిగా మోదీ రికార్డు
-మోసపూరిత హామీలతో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు యత్నం
-మోదీపై బీజేపీ ఎంపీ శతృఘ్న మండిపాటు

పాట్నా, మార్చి 14: ప్రధాని నరేంద్రమోదీపై బీజేపీ అసమ్మతి నేత, ఎంపీ శతృఘ్న సిన్హా మరోసారి మండిపడ్డారు. కేంద్రంలో మెరుగైన నూతన నాయకత్వం అధికార పగ్గాలు చేపట్టేందుకు ఇది సరైన సమయం అని పేర్కొన్నారు. బీజేపీ నుంచి తన నిష్క్రమణ ఖాయమని భావిస్తున్న శతృఘ్న సిన్హా.. వచ్చే వారం బీహార్ విపక్షాల ఆధ్వర్యంలో ఏర్పాటైన మహాఘట్‌బంధన్‌లో చేరే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీపై ధ్వజమెత్తారు. ఐదేండ్ల పదవీ కాలంలో ఒక్కసారి కూడా ఆయన మీడియా ముందుకు రాలేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడినందున ఇప్పటికైనా ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయండని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఐదేండ్ల పదవీ కాలంలో మీడియా సమావేశంలో ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పని ప్రధానిగా మీరు నిలిచిపోతారు అని ట్వీట్ చేశారు.

మీ పదవీ కాలం ముగింపు దశలో చివరి నెల, చివరి వారంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ, ఇతర ప్రాంతాల్లో 150 ప్రాజెక్టులు ప్రకటించారు. సాంకేతికంగా ఇది ఎన్నికల కోడ్‌కు వ్యతిరేకం కాకపోవచ్చు. కానీ ఈ ప్రాజెక్టులను ప్రకటించడం మరోసారి మోసపూరిత హామీలు ఇవ్వడమే అవుతుంది. జై హింద్ అని ట్వీట్లు ముగించారు. 1990ల నుంచి బీజేపీలో కొనసాగుతున్న శతృఘ్న సిన్హా.. వాజపేయి హయాంలో మంత్రిగానూ పని చేశారు. రెండోసారి పాట్నా సాహిబ్ స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2014లో మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బీజేపీకి దూరమయ్యారు. తాజాగా పాట్నా సాహిబ్ స్థానం నుంచే పోటీ చేస్తానని శతృఘ్న సిన్హా ప్రకటించడంతో ఆయన మరో పార్టీలో చేరనున్నారని తేలిపోయింది. కాంగ్రెస్ నుంచి గానీ, ఆర్జేడీ నుంచి గానీ ఆయన పోటీ చేసే అవకాశం ఉన్నది. ఈ నెల 22న ఆయన అభ్యర్థిత్వం ఖరారు కావచ్చునని భావిస్తున్నారు.

416
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles