బాలుడికి ప్రాణభిక్ష పెట్టిన రిక్షా!

Mon,October 21, 2019 02:57 AM

-35 అడుగుల ఎత్తు నుంచి పడినా..ప్రాణాలతో బయటపడిన చిన్నారి

టికామ్‌గఢ్‌: రెండంతస్తుల భవనంపై నుంచి కిందపడిన మూడేండ్ల చిన్నారి అనూహ్య రీతిలో ప్రాణాలతో బయటపడ్డాడు. రోడ్డుపై వెళ్తున్న ఓ రిక్షా అతడి ప్రాణాలను కాపాడింది. 35 అడుగుల ఎత్తున్న బిల్డింగ్‌ నుంచి ప్రమాదవశాత్తూ జారిన ఆ చిన్నారి.. అదేసమయంలో రోడ్డుపై వెళ్తున్న రిక్షాలోని సీటుపై పడటంతో పెను ప్రమాదం తప్పింది. మధ్యప్రదేశ్‌లోని టికామ్‌గఢ్‌లో ఈ ఘటన చోటుచేసుకున్నది. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రమాదం గురించి బాలుడి తండ్రి మాట్లాడుతూ.. ‘కుటుంబ సభ్యులతో కలిసి రెండో అంతస్తులో నా కుమారుడు ఆడుకుంటున్నాడు. మా తండ్రి, సోదరి కూడా అక్కడే ఉన్నారు. చిన్నారి ఆడుకుంటూ అలాగే బాల్కనీలోకి వెళ్లి రెయిలింగ్‌కు వేలాడటం మొదలుపెట్టాడు. అయితే ప్రమాదవశాత్తూ బ్యాలెన్స్‌ తప్పడంతో కిందపడిపోయాడు. అయితే అదే సమయంలో ఓ రిక్షావాలా దేవుడిలా వచ్చి నా కుమారుడిని కాపాడాడు. వెంటనే మేం బాలుడిని దవాఖానకు తీసుకెళ్లాం’ అని వివరించాడు. సీటీ స్కాన్‌, ఎక్స్‌రే, ఇతర పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. బాలుడు క్షేమంగా ఉన్నట్టు చెప్పారు.

1044
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles