మద్రాస్ హైకోర్టు సీజే రాజీనామా ఆమోదం

Sun,September 22, 2019 02:28 AM

న్యూఢిల్లీ: మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ వీకే తహిల్ రమణి రాజీనామా ఆమోదం పొందినట్లు కేంద్ర ప్రభుత్వం శనివారం ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది. సెప్టెంబర్ 6 నుంచే ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది. అలాగే మద్రాస్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ వీ కొఠారీని నియమిస్తూ మరో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మేఘాలయ హైకోర్టుకు బదిలీ చేయడాన్ని పునఃసమీక్షించాలని తాను చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు కొలీజియం తిరస్కరించడంతో జస్టిస్ తహిల్ రమణి ఈ నెల 6న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. జస్టిస్ తహిల్ రమణి బదిలీపై మద్రాస్ హైకోర్టుతోపాటు ఆమె సొంత రాష్ట్రమైన మహారాష్ట్రలోని బాంబే హైకోర్టు న్యాయవాదులు తీవ్ర నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈ నెల 17న అత్యున్నత న్యాయస్థానం ఒక ప్రకటన విడుదల చేసింది. సముచిత కారణాలతోనే హైకోర్టు సీజేలు, న్యాయమూర్తులను బదిలీ చేశామని స్పష్టంచేసింది. న్యాయస్థానం ప్రయోజనాల దృష్ట్యా ఆ కారణాలను వెల్లడించడం లేదని, అవసరమైన పరిస్థితులు తలెత్తితే వాటిని బయటపెట్టడానికి న్యాయస్థానం సంకోచించబోదని తేల్చిచెప్పింది.

257
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles