పిటిషన్‌ ఉపసంహరణకు ఓకే

Tue,October 15, 2019 02:22 AM

- తమిళిసైకి మద్రాసు హైకోర్టు అనుమతి


చెన్నై, అక్టోబర్‌ 14: తమిళనాడు బీజేపీ శాఖ మాజీ అధ్యక్షురాలు తమిళిసై సౌందర్‌రాజన్‌ డీఎంకే ఎంపీ కనిమొళికి వ్యతిరేకంగా దాఖలుచేసిన ఎన్నికల పిటిషన్‌ను ఉపసంహరించుకొనేందుకు మద్రాస్‌ హైకోర్టు సోమవారం అనుమతిచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో తమిళిసై తూత్తుకుడి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీచేసి కనిమొళి చేతిలో ఓటమిపాలయ్యారు. దీంతో ఆమెతోపాటు తూత్తుకుడి ఓటర్‌ శంతనకుమార్‌ దాఖలు చేసిన పిటిషన్లు మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఎం సుబ్రమణ్యం ఎదుట విచారణకు వచ్చాయి. ఎన్నికల నామినేషన్‌ పత్రాల్లో కనిమొళి తన భర్తతోపాటు కుమారుని ఆస్తులకు సంబంధించిన కొన్ని వాస్తవాలను దాచిపెట్టారని తమిళిసై ఆ పిటిషన్‌లో ఆరోపించారు. అయితే తెలంగాణ గవర్నర్‌గా రాజ్యాంగ బద్ధమైన పదవిలో నియమితులైనందున తమిళిసై తన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని భావిస్తున్నట్టు ఆమె తరఫు న్యాయవాది తెలియజేయడంతో జడ్జి అందుకు అనుమతించారు. పిటిషన్‌ ఉపసంహరణ నిర్ణయాన్ని ఓ ఆంగ్ల దినపత్రికతోపాటు ఓ తమిళ దినపత్రికలో ప్రచురించాలని ఆదేశిస్తూ విచారణను నవంబర్‌ 11కు వాయిదా వేశారు.

168
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles