లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా మేనకాగాంధీ?


Fri,May 31, 2019 03:51 AM

Maneka Gandhi likely to be pro tem speaker in 17th Lok Sabha

న్యూఢిల్లీ, మే 30: 17వ లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ సీనియర్ నేత మేనకాగాంధీని నియమించే అవకాశమున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో యూపీలోని సుల్తాన్‌పూర్ నియోజకవర్గం నుంచి ఆమె గెలుపొందారు. ఇప్పటివరకూ ఎనిమిది సార్లు ఎంపీగా పార్లమెంట్‌కు ప్రాతినిథ్యం వహించారు. మంత్రిగా కూడా విధులు నిర్వహించారు. ప్రొటెం స్పీకర్ తాత్కాలిక పదవి. కొత్తగా లోక్‌సభకు ఎన్నికైన సభ్యులచేత ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారు. ఎన్నికల తర్వాత కొలువుదీరిన తొలి లోక్‌సభ సమావేశాలకు ప్రొటెం స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. ప్రొటెం స్పీకర్ అధ్యక్షతలోనే లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ల ఎన్నిక జరుగుతుంది.

1238
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles