అతిథిగా కాదు.. యాత్రికునిగా

Mon,October 21, 2019 02:43 AM

-మన్మోహన్‌ కర్తార్‌పూర్‌ సందర్శనపై ఆయన సన్నిహితుల వెల్లడి

న్యూఢిల్లీ/ఇస్లామాబాద్‌, అక్టోబర్‌ 20: మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ పాకిస్థాన్‌లో కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధికారిక హోదాలో హాజరుకాబోరని, కేవలం సామాన్య యాత్రికునిగానే అక్కడికి వెళ్తారని ఆయన సన్నిహితవర్గాలు ఆదివారం వెల్లడించాయి. ఈ కార్యక్రమానికి హాజరుకావాలన్న తన ఆహ్వానానికి మన్మోహన్‌సింగ్‌ అంగీకరించారని పాక్‌ విదేశాంగ మంత్రి షా మహమూద్‌ ఖురేషీ ప్రకటించిన నేపథ్యంలో మన్మోహన్‌ సన్నిహితులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తన ఆహ్వానానికి మన్మోహన్‌ అంగీకరించారని, నవంబర్‌ 9న జరిగే కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ప్రత్యేక అతిథిగా కాకుండా సామాన్య యాత్రికునిగా హాజరవుతారని షా మహమూద్‌ ఖురేషీ శనివారం ముల్తాన్‌లో విలేకరులకు తెలిపినట్టు ‘డాన్‌' వార్తాప్రతిక పేర్కొన్నది. చారిత్రక కర్తార్‌పూర్‌ పుణ్యక్షేత్రాన్ని సామాన్య యాత్రికునిగానే సందర్శిస్తానని పాక్‌ అధికారుల ఆహ్వానానికి జవాబిస్తూ రాసిన లేఖలో మన్మోహన్‌ పేర్కొన్నట్టు న్యూఢిల్లీలోని ఆయన సన్నిహితులు తెలిపారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్‌ నేతృత్వంలో కర్తార్‌పూర్‌కు వెళ్లే సిక్కు జాతా ప్రతినిధి బృందంలో మన్మోహన్‌సింగ్‌ భాగస్వామిగా ఉంటారు. వీరంతా కర్తార్‌పూర్‌లో ప్రార్థనలు నిర్వహించి అదేరోజు స్వదేశానికి తిరిగొస్తారు.

ప్రారంభంకాని ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు

కర్తార్‌పూర్‌లోని గురుద్వారా దర్బార్‌ సాహిబ్‌ను సందర్శించే భక్తులకు ఆదివారం ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభంకాలేదు. ఈ యాత్రకు వచ్చేవారు 20 డాలర్ల (సుమారు రూ.1,400) ఫీజు చెల్లించాలన్న ఇస్లామాబాద్‌ డిమాండ్‌ సహా పలు అంశాలపై భారత్‌, పాక్‌ మధ్య ఇప్పటికీ అంగీకారం కుదరకపోవడమే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు. కాగా కర్తార్‌పూర్‌ కారిడార్‌ను నవంబర్‌ 9న పాకిస్థాన్‌ ప్రారంభిస్తుందని ఆ దేశ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ ఆదివారం ప్రకటించారు.

216
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles