మన్మోహన్ శక్తిమంతుడు కాదు!


Fri,March 15, 2019 11:13 AM

Manmohan Singh was not as tough as PM Modi

కాంగ్రెస్ పార్టీ నేత షీలాదీక్షిత్ వివాదాస్పద వ్యాఖ్య
పాట్నా, మార్చి 14: ఢిల్లీ మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షీలా దీక్షిత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. సొంత పార్టీనే ఇబ్బందుల్లోకి నెట్టారు. సీమాంతర ఉగ్రవాదాన్ని అడ్డుకోవడంలో ప్రధాని నరేంద్రమోదీతో పోలిస్తే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత శక్తిమంతుడు, సంకల్పం కలవారు కాదని ఓ ఆంగ్ల టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. 2008లో 26/11 ఉగ్ర దాడుల సమయంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదన్న విమర్శలు నిజమేనని ఆమె అంగీకరిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. తద్వారా ప్రధాని మోదీ మాత్రమే భారతదేశానికి సమర్థవంతమైన శక్తిమంతమైన ప్రభుత్వాన్ని అందించగలరని ప్రచారం చేస్తున్న బీజేపీకి అస్త్రం అందించారు. మరోవైపు భారత్ ఎల్లవేళలా సురక్షితమేనని షీలా దీక్షిత్ స్పష్టం చేశారు. అయితే పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో జైషే ఉగ్రవాద శిక్షణా శిబిరంపై రాజకీయాల కోసమే ప్రధాని మోదీ.. వైమానిక దాడులు చేయించారని పేర్కొన్నారు.

మన్మోహన్ సింగ్ శక్తిమంతుడు కాదన్న తన వ్యాఖ్యపై దుమారం చెలరేగడంతో ఏఎన్‌ఐ వార్తా సంస్థతో షీలా మాట్లాడుతూ నేను మాట్లాడిన దాంట్లో కొంత భాగం మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే నేను చెప్పేదేమీ లేదు అని పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్‌పై షీలా దీక్షిత్ ప్రతికూల వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. కామన్‌వెల్త్ గేమ్స్ (సీడబ్ల్యూజీ)లో మన్మోహన్ సింగ్ జోక్యాన్ని ఆమె గతంలో ప్రశ్నించారు. 2011లో ఢిల్లీ ప్రభుత్వంపై అన్నా హజారే అవినీతి ఆరోపణలు చేసినప్పుడు షీలా దీక్షిత్ రాజీనామాకు సిద్ధపడారు. అయితే యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ సలహాదారు అహ్మద్ పటేల్ ఆమెకు నచ్చజెప్పారు. యూపీఏ హయాంలో తమ ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య గల సంబంధాలపై అన్ని వేళలా నిజం చెప్పడం మంచిది కాదన్నారు.

380
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles