మోదీ తుగ్లక్ చర్యను మరిచిపోనివ్వం

Sat,November 9, 2019 01:06 AM

న్యూఢిల్లీ: మూడేైండ్ల క్రితం పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీ తుగ్లక్ చర్యపై దేశ ప్రజలను మరిచిపోనివ్వమని, దేశంతో పాటు చరిత్ర కూడా ఆ నిర్ణయాన్ని క్షమించదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. నోట్ల రద్దు వల్ల 120 మందికిపైగా మరణించారని, చిన్న-మధ్య స్థాయి వ్యాపారాలు దెబ్బతినడంతో ఉద్యోగాలు కోల్పోయి ఎంతో మంది రోడ్డునపడ్డారని సోనియా విమర్శించారు. ప్రధాని మోదీ, ఆయన సహచర మంత్రులు 2017 నుంచి నోట్ల రద్దుపై మాట్లాడం మానేశారు. దీని గురించి దేశం మరిచిపోతుందని వారు భావించి ఉంటారు. ఈ తుగ్లక్ చర్యను కాంగ్రెస్ మరిచిపోనివ్వదు అని పేర్కొన్నారు. పెద్ద నోట్లరద్దు చర్య ఉగ్రదాడి వంటిదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో విమర్శించారు. నోట్ల రద్దు అనే ఉగ్రదాడి జరిగి మూడేైండ్లెంది. ఈ విపత్తు భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది అని ట్వీట్ చేశారు.

181
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles