నవకశ్మీర్‌ను నిర్మిద్దాం

Mon,September 23, 2019 03:08 AM

కశ్మీరీ పండిట్లతో ముచ్చటించిన ప్రధాని
హ్యూస్టన్‌: అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీని శనివారం హ్యూస్టన్‌లో కశ్మీర్‌ పండి ట్ల ప్రతినిధుల బృందం కలిసింది. కశ్మీర్‌లో ప్రస్తుతం సరికొత్త గాలులు వీస్తున్నాయని, అందరం కలిసికట్టుగా నవకశ్మీర్‌ను నిర్మిద్దామని ప్రధాని వారితో పేర్కొన్నారు. 30 ఏండ్లకుపైగా సహనంతో ఉండడం పట్ల మోదీ వారికి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని కేంద్రం రద్దు చేసినందుకు కశ్మీరీ పండిట్లు ప్రధానికి ధన్యవాదాలు తెలియజేశారు. మోదీ ప్రభుత్వానికి 7,00,000 మంది కశ్మీరీ పండిట్లు రుణపడి ఉంటారని చెప్పారు. కశ్మీరీ పండిట్లు తిరిగి స్వస్థలానికి వచ్చేందుకు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేయాలని అభ్యర్థించారు. ఈ మేరకు ప్రధానికి ఒక వినతిపత్రాన్ని అందజేశారు. కశ్మీరీ పండిట్లు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని, ఇక అందరం కలిసి అందరి కోసం సరికొత్త కశ్మీర్‌ను నిర్మించాల్సిన అవసరం ఉందని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దావూదీ బోహ్రా వర్గానికి చెందిన ప్రతినిధులతోనూ ప్రధాని సమావేశమయ్యారు. ‘దావుదీ బోహ్రా సామాజిక వర్గం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును పొందింది. హ్యూస్టన్‌లో వారిని కలిసే అవకాశం లభించింది. ఈ సందర్భంగా వారితో వివిధ అంశాలపై మాట్లాడాను’ అని ప్రధాని ట్వీట్‌ చేశారు.

347
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles