ప్లాస్టిక్‌ను త్యజించండి


Mon,August 26, 2019 01:49 AM

PM Modi urges country to end usage of single use plastic

-ప్లాస్టిక్హ్రిత రోజుగా గాంధీ జయంతి
-ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్మూలించేందుకు కార్పొరేట్లు సరైన మార్గాలన్వేషించాలి
-సెప్టెంబర్ 11 నుంచి స్వచ్ఛతా హీ సేవలో పాల్గొనాలి
-దేశ ప్రజలకు మన్‌కీ బాత్‌లో ప్రధాని నరేంద్రమోదీ పిలుపు

న్యూఢిల్లీ, ఆగస్టు 25: జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా వచ్చే అక్టోబర్ రెండో తేదీన భారత్‌ను ప్లాస్టిక్ రహితంగా తీర్చి దిద్దాలని దేశ ప్రజలను ప్రధాని నరేంద్రమోదీ అభ్యర్థించారు. అక్టోబర్ 27న దీపావళి నాటికి ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపునకు ముందుకు రావాలని వివిధ వర్గాల ప్రజలకు పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ కోసం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్మూలించేందుకు ప్రజా ఉద్యమం చేపట్టాలని కోరారు. ప్రధాని మోదీ తన నెలవారీ మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్మూలించేందుకు దీపావళిలోగా సరైన మార్గాలు అన్వేషించాలని కార్పొరేట్ రంగాన్ని కోరుతున్నా. దీన్ని పునర్వినియోగంలోకి తీసుకొస్తే ఇంధనంగా పరివర్తన చెందుతుంది. ఇది ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్మూలించేందుకు సరైన మార్గం అని అన్నారు. సెప్టెంబర్ 11 నుంచి వార్షిక స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొనాలని దేశ ప్రజలకు విజ్ఞప్తిచేశారు. ఈ ఏడాది అక్టోబర్ రెండో తేదీన మనం బాపూజీ 150వ జయంతి జరుపుకుంటున్నాం.

ఈ సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన రహిత దేశంగా భారత్‌ను తీర్చిదిద్దడంతోపాటు ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా నూతన విప్లవానికి పునాది వేయడమే ఆయనకిచ్చే నివాళి. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఒకరోజు ప్లాస్టిక్ రహిత మదర్‌ఇండియాగా తీర్చిదిద్దేందుకు ముందుకు రావాలి అని పిలుపునిచ్చారు. పులుల సంఖ్య గురించి ప్రస్తావిస్తూ.. దేశంలో 2967 పులులు ఉన్నాయని, కొన్నేండ్ల క్రితం ఇందులో సగం పులులు మాత్రమే ఉన్నాయని మోదీ చెప్పారు. 2010 పులుల సదస్సులో 2022 నాటికి అంతర్జాతీయంగా పులుల సంఖ్య రెట్టింపు చేయాలని తీర్మాణించారన్నారు.మరోవైపు వచ్చేనెలలో ప్రారంభించనున్న పోషణ్ అభియాన్ (పౌష్ఠికాహార ప్రచారోద్యమం)లో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బాలలు, మహిళలకు పౌష్టికాహారం కోసం ప్రజా ఉద్యమం చేపట్టాలన్నారు. ఈ నెల 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఫిట్ ఇండియా మూవ్‌మెంట్ ప్రారంభిస్తామన్నారు. టెక్నాలజీ సాయంతో హిందీని అర్థం చేసుకోవడం చాలా తేలిక అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జిమ్ కార్‌బెట్ట్ నేషనల్ పార్క్‌లో బేర్‌గ్రిల్స్‌తో నిర్వహించిన మ్యాన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమంలో.. గ్రిల్స్ తన చెవిలో చిన్న కార్డ్‌లెస్ పరికరాన్ని వాడటంతో నేను హిందీలో మాట్లాడితే ఆయన ఇంగ్లిష్‌లో విన్నాడు. ఇది టెక్నాలజీ సృష్టించిన అద్భుతం అని చెప్పారు.

717
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles