సబ్‌ కలెక్టర్‌గా అంధ మహిళ

Tue,October 15, 2019 02:17 AM

- తిరువనంతపురంలో బాధ్యతలు స్వీకరించిన ప్రంజల్‌ పాటిల్‌ దేశంలోనే తొలి అంధ ఐఏఎస్‌


తిరువనంతపురం, అక్టోబర్‌ 14: దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌ (ఐఏఎస్‌)కు ఎంపికైన అంధ మహిళ ప్రంజల్‌ పాటిల్‌ (30) సోమవారం కేరళలోని తిరువనంతపురం జిల్లా సబ్‌ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. మహారాష్ట్రలోని ఉల్లాస్‌ నగర్‌కు చెందిన ప్రంజల్‌ పాటిల్‌ ఆరేండ్ల వయస్సులోనే చూపు కోల్పోయారు. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) 2016 పరీక్షల్లో 773వ ర్యాంక్‌ సాధించిన ప్రంజల్‌ ఆ మరుసటి సంవత్సరం 124వ ర్యాంక్‌ సాధించి ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ఆమె ట్రైనింగ్‌ పీరియడ్‌లో తొలుత ఎర్నాకుళం అసిస్టెంట్‌ కలెక్టర్‌గా నియమితులయ్యారు. డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘మనం ఎప్పటికీ ఓడిపోకూడదు.. ఎప్పటికీ వదులుకోకూడదు.. మనం చేసే ప్రయత్నాల్లోనే మన పురోగతి కనిపిస్తుంది’ అని వ్యాఖ్యానించారు.

1030
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles