రక్షణ స్థావరాల వద్ద హై అలర్ట్‌

Thu,October 17, 2019 01:37 AM

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌కు చెందిన పలువురు ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడ్డారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ప్రధానంగా కశ్మీర్‌, పంజాబ్‌ల్లో వీళ్లు తిష్ఠ వేశారని తెలిపాయి. భారత సైనిక, వైమానిక స్థావరాలు లక్ష్యంగా వీళ్లు దాడులకు తెగబడే అవకాశముందన్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు పంజాబ్‌, కశ్మీర్‌లలోని సైనిక స్థావరాలకు హై అలర్ట్‌.. వైమానిక స్థావరాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ను జారీ చేశారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కేంద్రం రద్దు చేసినప్పటి నుంచి భారత సైనిక, వైమానిక స్థావరాలపై దాడులు చేయడానికి పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారని ఇటీవల నిఘా వర్గాలు హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే చొరబాటుకు సంబంధించి బుధవారం కూడా నిఘా వర్గాలకు మళ్లీ సమాచారం అందింది. ఈ నేపథ్యంలో కశ్మీర్‌, పంజాబ్‌లలోని సైనిక, వైమానిక స్థావరాల వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.

325
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles