ఒక్క రాత్రిలోనే రూ.8.1 కోట్లు ఖర్చు!

Mon,October 21, 2019 01:50 AM

-రతుల్‌పురి విలాస జీవితం.. చార్జిషీట్‌లో ఈడీ వెల్లడి
న్యూఢిల్లీ, అక్టోబర్ 20: మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ మేనల్లుడు రతుల్‌పురి అమెరికాలోని నైట్‌క్లబ్‌లో ఒక్క రాత్రిలోనే సుమారు రూ.8.1 కోట్లు ఖర్చు చేసినట్లు ఈడీ తెలిపింది. రూ.8,000 కోట్ల బ్యాంకు రుణాల మనీ ల్యాండరింగ్ కేసులో రతుల్‌తోపాటు, ఆయన సన్నిహితులు, మోసర్ బేర్ లిమిటెడ్‌పై గత గురువారం దాఖలు చేసిన చార్జిషీట్‌లో ఈడీ వెల్లడించింది. లావాదేవీల నిర్ధారణ పూర్తయింది. రతుల్‌పురి అమెరికాలోని ఒక నైట్‌క్లబ్‌లో ఒక్క రాత్రిలోనే సుమారు రూ.8.1 కోట్లు ఖర్చుచేశారు అని ఈడీ తెలిపింది. 2011 నవంబర్, 2016 అక్టోబర్ మధ్య కాలం లో రతుల్ వ్యక్తిగత ఖర్చు సుమారు రూ. 31 కోట్లు అని పేర్కొం ది. ఆగస్టు 20న అరెస్టయిన రతుల్‌పురి ప్రస్తు తం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు.

381
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles