జనసేన ఎమ్మెల్యే రాపాకకు బెయిల్


Wed,August 14, 2019 12:19 AM

Razole Janasena MLA Rapaka Varaprasad Released on Bail

-పోలీస్‌స్టేషన్‌పై దాడి చేశారంటూ కేసు నమోదు
అమరావతి, నమస్తే తెలంగాణ: పోలీస్‌స్టేషన్‌పై దాడికి పాల్పడ్డాడంటూ నమోదైన కేసులో తూర్పుగోదావరి జిల్లా రాజోలుకు చెందిన జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు బెయిల్ మంజూరయింది. స్టేషన్‌లో లొంగిపో యిన ఎమ్మెల్యేను ఉత్కంఠ పరిణామా ల మధ్య అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించిన పోలీసులు ఆయనను రాజోలు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు సూచనల మేర కు పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చారు. వరప్రసాద్ అరెస్ట్‌పై హైదరాబాద్‌లో స్పందించిన జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ .. ప్రజల కోసం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన ప్రజాప్రతినిధిపై కేసులు పెట్టడంసరికాదని, గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తీసుకువచ్చారన్నారు.

87
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles