ఆ ఐదెకరాల్లో స్కూళ్లు, దవాఖానాలు నిర్మించాలి

Mon,November 11, 2019 02:07 AM

- సల్మాన్‌ తండ్రి సలీం ఖాన్‌


ముంబై: సున్నీ వక్ఫ్‌ బోర్డుకు ప్రభుత్వం కేటాయించనున్న 5 ఎకరాల స్థలంలో స్కూళ్లు, దవాఖానాలు నిర్మించాలని బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ తండ్రి, సినీ రచయిత సలీమ్‌ ఖాన్‌ సూచించారు. అయోధ్యపై సుప్రీంకోర్టు శనివారం వెలువరించిన తీర్పుపై ఆదివారం ఆయన స్పందించారు. తీర్పును విమర్శించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్న ఆయన, ఏండ్ల నాటి ఈ సమస్యను ఇంతటితో ముగించడం మంచిదన్నారు. సినిమాలాగా ఈ సమస్య కూడా ముగిసిపోయిందన్నారు. నమాజ్‌ చేసుకునేందుకు పరిశుభ్రమైన ప్రాంతం చాలన్న సలీం ఖాన్‌, దీని కోసం మసీదును నిర్మించాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం మనకు కావాల్సినవి స్కూళ్లు, దవాఖానలని , వీటి గురించే మనం ఆలోచించాలని సూచించారు. ముస్లిం పిల్లలు విద్యలో రాణిస్తే వారి భవిష్యత్తు బాగుంటుందని సలీం అభిప్రాయపడ్డారు.

4997
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles