పంజాబ్‌లో ఉగ్ర కుట్ర భగ్నం

Mon,September 23, 2019 03:10 AM

-భారీగా ఆయుధాలు స్వాధీనం
-నలుగురు కేజడ్‌ఎఫ్‌ ఉగ్రవాదులు అరెస్ట్‌

చండీగఢ్‌: భారీ ఉగ్ర కుట్రను పంజాబ్‌ పోలీసులు భగ్నం చేశారు. ఖలిస్థాన్‌ జిందాబాద్‌ ఫోర్స్‌ (కేజడ్‌ఎఫ్‌)కు చెందిన నలుగురు ఉగ్రవాదులను అరెస్ట్‌ చేయడంతోపాటు వారి నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నిఘావర్గాల సమాచారం ఆధారంగా ఆదివారం తరణ్‌ తరణ్‌ జిల్లాలోని చోహ్లా సాహిబ్‌ గ్రామ శివారులో కారులో వెళ్తున్న నలుగుర్ని అరెస్ట్‌ చేయడంతో ఈ ఉగ్ర కుట్ర బయటపడిందని పంజాబ్‌ డీజీపీ దినకర్‌ గుప్తా తెలిపారు. ఐదు ఏకే-47 రైఫిళ్లు, 16 మ్యాగజైన్స్‌, 472 రౌండ్ల మందుగుండు, నాలుగు చైనా తయారీ పిస్తోళ్లతోపాటు మందుగుండు, 9 గ్రెనేడ్లు, ఐదు శాటిలైట్‌ ఫోన్లు, రెండు మొబైల్‌ ఫోన్లు, రెండు వైర్‌లెస్‌ సెట్లతోపాటు రూ.10 లక్షల విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ ఆయుధాలను పాక్‌ నుంచి డ్రోన్ల ద్వారా సరఫరా చేసినట్లు నిర్ధారించామన్నారు. జమ్ముకశ్మీర్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్‌, జర్మనీ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న కేజడ్‌ఎఫ్‌ మళ్లీ తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నాలు చేపట్టిందన్నారు. జమ్ముకశ్మీర్‌, పంజాబ్‌తోపాటు ఇతర రాష్ర్టాల్లో ఉగ్ర దాడులకు వ్యూహరచన చేయడంతోపాటు స్థానికులను చేర్చుకుంటున్నదని గుప్తా చెప్పారు. మరోవైపు ఉగ్ర కుట్రతోపాటు అంతర్జాతీయ వ్యవహారాలు ఉండటంతో ఈ కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగించాలని పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ నిర్ణయించారు.

484
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles