సీమలో హైకోర్టు ఏర్పాటుచేయాలి

Thu,October 17, 2019 01:25 AM

- అమరావతిలో ఆ ప్రాంత న్యాయవాదుల ఆందోళన
- లేకుంటే రాజధానినైనా తరలించాలని డిమాండ్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి వికేంద్రీకరణ జరుగాలంటే రాయలసీమలోనే హైకోర్టు ఏర్పాటుచేయాలంటూ ఆ ప్రాంత న్యాయవాదులు డిమాండ్‌చేశారు. బుధవారం అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల నుంచి న్యాయవాదులు భారీ సంఖ్యలో అమరావతి సచివాలయానికి తరలివచ్చారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కాన్వాయ్‌ వెళ్తుండగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. హైకోర్టును రాయలసీమకు తరలించాలని, లేదంటే రాజధానిని అయినా ఏర్పాటుచేయాలని డిమాండ్‌చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. శ్రీబాగ్‌ ఒప్పందం మేరకు హైకోర్టును రాయలసీమకు తరలించాలని డిమాండ్‌చేశారు.

203
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles