నూతన జాతీయ విద్యా విధానం

Sat,July 6, 2019 03:12 AM

-పరిశోధనల ప్రోత్సాహానికి నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్
-ప్రపంచస్థాయి విద్యాసంస్థలు నెలకొల్పేందుకు 400 కోట్లు
-విద్యాశాఖకు బడ్జెట్‌లో రూ.94,853.64 కోట్లు

న్యూఢిల్లీ: నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పా టు.. నూతన జాతీయ విద్యావిధానం.. ప్రపంచస్థాయి విద్యాసంస్థలు నెలకొల్పేందుకు రూ.400 కోట్లు కేటాయింపు.. విద్యారంగానికి సంబంధించి కీలకమైన బడ్జెట్ ప్రకటనలు ఇవే. 2019-20 ఆర్థిక సంవత్సరానికిగానూ విద్యారంగానికి రూ.94,853.64 కోట్లు కేటాయించారు. 2018-19 సవరించిన అంచనా ల కంటే ఇది 13 శాతం అధికం. 2018-19లో విద్యారంగానికి రూ.85,010 కోట్లు ఇవ్వగా అనంతరం దాన్ని 83,625.86 కోట్లు గా సవరించారు. శుక్రవారం పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. దేశంలో విద్యనభ్యసించేందుకు విదేశీ విద్యార్థులను ఆకర్షించే లక్ష్యం తో స్టడీ ఇన్ ఇండియా ప్రోగ్రామ్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో ఉన్నత విద్యను ప్రపంచంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుగా నూతన విద్యా విధానాన్ని తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎన్‌ఆర్‌ఎఫ్)ను ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించారు. బడ్జెట్‌లో ఉన్నత విద్యకు రూ.38,317.01 కోట్లు, పాఠశాల విద్యకు రూ.56,536.36 కోట్లు కేటాయించారు. హయ్యర్ ఎడ్యుకేషన్ ఫైనాన్సింగ్ ఏజెన్సీ(హెచ్‌ఈఎఫ్‌ఏ) ఫండింగ్ మెకానిజం ద్వారా ఉన్నత విద్యకు అదనంగా రూ. 30వేల కోట్లు సమకూర్చనున్నట్లు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ తెలిపింది. యూజీసీ కి గతంలో రూ. 4,687.23 కోట్లు ఇవ్వగా ఈసారి రూ.4600.66 కోట్లు కేటాయించారు.

గాంధీ బోధనలతో గాంధీపీడియా

మహాత్మాగాంధీ బోధనలు, విలువలను యువతకు చెప్పేందుకు గాంధీపీడియాను రూపొందిస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (హెచ్‌ఈసీఐ) ముసాయిదా బిల్లును ఈ ఏడాది ప్రవేశపెడుతామని చెప్పారు. కిందిస్థాయి నుంచి క్రీడా సంస్కృతిని పెంపొందించేలా ఖేలో ఇండియా పథకాన్ని విస్తరిస్తామని పేర్కొన్నారు.

302
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles