కశ్మీర్‌లో పెట్రేగిన ఉగ్రవాదులు

Tue,October 15, 2019 12:50 AM

- లారీ డ్రైవర్‌ కాల్చివేత


శ్రీనగర్‌, అక్టోబర్‌ 14: కశ్మీర్‌లో పరిస్థితులు కుదుటపడుతున్నాయనుకుంటున్న తరుణంలో ఉగ్రవాదులు మరోసారి చెలరేగి పోయారు. సోమవారం షోపియాన్‌ జిల్లాలో ఒక లారీ డ్రైవర్‌పై కాల్పులు జరిపి పొట్టన బెట్టుకున్నారు. ఓ పండ్ల తోటల యజమానిపై దాడి చేశారు. ఈ దాడులకు పాల్పడిన వారిలో ఒకరిని పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నారు. కశ్మీర్‌లో పండ్ల రవాణా మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటుండటంతో ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తున్నది. 370 అధికరణం రద్దు నేపథ్యంలో 72 రోజుల తర్వాత కశ్మీర్‌లో సెల్‌ఫోన్ల సేవలను పునరుద్ధరించిన నాడే ఈ ఘటనలు జరిగాయి. మరణించిన లారీ డ్రైవర్‌ను రాజస్థాన్‌కు చెందిన షరీఫ్‌ఖాన్‌గా పోలీసులు గుర్తించారు. ఈ రెండు ఘటనల పట్ల కశ్మీరీలు ఆగ్రహం వ్యక్తం చేశారని పోలీసులు తెలిపారు.

166
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles