పదవులపై ఫిర్యాదులు ఆపండి..

Tue,January 14, 2020 02:47 AM

-లేకుంటే ఉద్ధవ్‌ రాజీనామా చేస్తారు.. కాంగ్రెస్‌, ఎన్సీపీ నేతలకు యశ్వంత్‌రావు హెచ్చరిక
ముంబై: మంత్రి పదవుల కేటాయింపుపై ఫిర్యాదులు ఆపాలని, లేకుంటే సీఎం పదవికి ఉద్ధవ్‌ ఠాక్రే రాజీనామా చేసే ప్రమాదం ఉన్నదని కాం గ్రెస్‌ సీనియర్‌ నేత యశ్వంత్‌రావు గదఖ్‌ హెచ్చరించారు. మహారాష్ట్రలో పలు రాజకీయ పరిణామాల తర్వా త శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కూడిన సంకీర్ణ ప్రభుత్వం ఇటీవల ఏర్పడిన సంగతి తెలిసిందే. సర్కార్‌ ఏర్పడిన నెల తర్వాత ఉద్ధవ్‌ మంత్రివర్గ విస్తరణ జరిపారు. డిప్యూటీ సీఎం పదవితోపాటు కీలక హోం, ఆర్థిక, నీటిపారుదల శాఖలు ఎన్సీపీకి దక్కాయి. దీంతో తమకు కేటాయించిన శాఖల పట్ల కొందరు కాంగ్రెస్‌ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. తన పదవికి రాజీనామా చేస్తానన్న కాం గ్రెస్‌ మంత్రి అబ్దుల్‌ సత్తార్‌ను పార్టీ బుజ్జగించడంతో మెత్తబడ్డారు. ఎన్సీపీ నేతలూ తమకు దక్కిన మంత్రి పదవులపై పార్టీ అధినేతలకు ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో శివసేన నేతృత్వంలోని కూటమి సర్కార్‌ ఎక్కువ కాలం పాలన కొనసాగదని మాజీ సీఎం, బీజేపీ నేత ఫడ్నవీస్‌ ఇటీవల ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో లోక్‌సభకు వరుసగా 3 సార్లు గెలిచిన కాంగ్రెస్‌ ఎంపీ యశ్వంత్‌రావు స్పం దిస్తూ.. ‘ఉద్ధవ్‌ అందరిలాంటి నేత కాదు. ఆయనది కళాకారుడి మనస్తత్వం. కూటమిలోని కాంగ్రె స్‌, ఎన్సీపీ నేతలు ఫిర్యాదులను ఆపాలి. సరిగ్గా ప్రవర్తించాలి. లేకుంటే ఉద్ధవ్‌ ఠాక్రే రాజీనామా చేస్తారు’ అని హెచ్చరించారు.

323
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles