సిలిండర్‌ పేలి 13 మంది మృతి

Tue,October 15, 2019 02:29 AM

- యూపీలో దుర్ఘటన


మాయు (యూపీ): రెండంతస్తుల భవంతిలో గ్యాస్‌ సిలిండర్‌ పేలిన ఘటనలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన సోమవారం ఉదయం ఉత్తర్‌ప్రదేశ్‌ మాయు జిల్లాలోని వాలిద్‌పూర్‌లో జరిగింది. సిలిండర్‌ పేలడంతో ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. వంట చేస్తుండగా సిలిండర్‌ పేలినట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. గాయపడిన వారి ని జిల్లా దవాఖానకు తరలించారని, శిథిలాలను తొలగించే ప్రక్రియను పోలీసులు, అగ్నిమాపకశాఖ సిబ్బంది చేపట్టారని మాయు కలెక్టర్‌ జ్ఞాన్‌ప్రకాశ్‌ త్రిపాఠి తెలిపారు. సహాయక చర్యలు అందించేందుకు వారణాసి నుంచి ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది వచ్చిన్నట్టు ఎస్పీ అనురాగ్‌ ఆర్య చెప్పారు. ఘటన పట్ల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ విచా రం వ్యక్తం చేశారు. తగిన సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా పోలీసులు, ఇతర శాఖల అధికారులను ఆదేశించారు.

324
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles