దేవరగట్టు రక్తసిక్తం

Thu,October 10, 2019 03:04 AM

కర్నూలు: ఏపీలోని కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టులో ఏటా దసరా రోజు నిర్వహించే కర్రల సమరం(బన్నీ ఉత్సవం)లో 50 మందికి పైగా గాయపడగా, నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఆదోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. తమ ఇలవేల్పును దక్కించుకొనేందుకు ఐదు గ్రామాల ప్రజలు రెండు వర్గాలుగా ఏర్పడి కర్రలతో తలపడ్డారు. ఇందులో ఇరువర్గాలకు తీవ్ర గాయలయ్యా. ఈ ఉత్సవాలను తిలకించేందుకు పొరుగు రాష్ర్టాల నుంచి లక్షలాది మంది భక్తులు రాగా, కలెక్టర్‌ వీరపాండియన్‌, ఎస్పీ ఫకీరప్ప పరిస్థితిని పర్యవేక్షించారు.

296
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles