కమలానికి ఓటేయడమంటే.. పాక్‌పై బాంబు వేయడమే!

Tue,October 15, 2019 12:42 AM

- యూపీ డిప్యూటీ సీఎం మౌర్య వ్యాఖ్య


ఠాణె, అక్టోబర్‌ 14: బీజేపీకి ఓటేయడమంటే పాకిస్థాన్‌పై అణుబాంబు వేయడం వంటిదని ఉత్తర్‌ప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య పేర్కొన్నారు. ఆర్టికల్‌ 370 రద్దు తరువాత జరుగుతున్న మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు ఎంతో కీలకమైనవన్నారు. ఈ ఎన్నికలు భారతీయుల నిజమైన దేశభక్తిని ప్రపంచానికి చాటనున్నాయని తెలిపారు. మహారాష్ట్రలోని భయందర్‌లో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా జరిగిన సభలో మౌర్య మాట్లాడారు. ‘ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రంలో కమలం గుర్తు ఉన్న మీటను నొక్కడం వల్ల.. ప్రధాని మోదీ, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌, అభ్యర్థి నరేంద్ర మెహతాకు మాత్రమే మీరు లబ్ధి చేకూర్చరు.. బీజేపీకి ఓటు వేయడం ద్వారా మీరు పాకిస్థాన్‌పై అణుబాంబు వేసిన వారవుతారు’ అని మౌర్య వ్యాఖ్యానించారు.

174
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles