ఉగ్రపోరులో భారత విధానం మారింది

Thu,October 10, 2019 03:02 AM

వాయుసేన దినోత్సవం సందేశంలో ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌ భదౌరియా


ఘజియాబాద్‌: ఉగ్రవాదుల దాడులను ఎదుర్కోవడంలో, ఉగ్రవాదానికి ఊతమిచ్చే వారిని శిక్షించడంలో భారత విధానం మారిందని, ఇందుకు బాలాకోట్‌పై జరిపిన దాడులే నిదర్శనమని వాయుసేన అధిపతి ఆర్కేఎస్‌ భదౌరియా చెప్పారు. భవిష్యత్తులో భారత్‌ చేపట్టేబోయే అన్నిరకాల సైనిక చర్యలు విజయవంతమయ్యేందుకు వాయుసేన తన సాయుధ సంపత్తితో సదా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. వాయుసేన 87వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని భదౌరియా తన దళానికి సందేశమిచ్చారు. బాలాకోట్‌పై జరిపిన దాడి భారత ప్రభుత్వ రాజకీయ నిశ్చయతను, వైమానిక దళం సామర్థ్యాన్ని తెలియజేసిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాలాకోట్‌పై జరిగిన దాడుల్లో పాల్గొన్న రెండు స్కాడ్రన్లు, ఒక సిగ్నల్‌ యూనిట్‌ను వాయుసేన ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలతో సత్కరించింది. ఈ సందర్భంగా వాయుసేన యుద్ధ విమానాలతో విన్యాసాలను ప్రదర్శించింది. బాలాకోట్‌పై దాడి తదనంతర ఘటనల్లో పాక్‌ యుద్ధ విమానాన్ని కూల్చేసిన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ కూడా ఒక విమానాన్ని నడుపుతూ ఈ విన్యాసాలలో పాల్గొన్నారు.
air-force1

332
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles