ఆంటీ.. మీ బాబుకు హాని తలపెట్టను

Sun,September 22, 2019 02:33 AM

-తనపై దాడి చేసిన విద్యార్థి తల్లికి మంత్రి సుప్రియో హామీ
-దాడి తాలుకు ఫొటో ట్వీట్

న్యూఢిల్లీ, ముంబై: ఇటీవల కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్సిటీలో తనపై దాడిచేసిన ఓ విద్యార్థి ఫొటోను కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అందులో విద్యార్థి దేబాంజన్ బల్లవ్ మంత్రి జుట్టును పట్టుకొని లాగుతున్నట్లు ఉన్నది. ఈ విషయం తెలిసిన బల్లవ్ తల్లి మీడియా ముందుకు వచ్చి తన కొడుకును ఏమీ చెయ్యవద్దని, ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మంత్రికి విజ్ఞప్తి చేశారు. దీంతో స్పందించిన మంత్రి ట్వీట్ చేస్తూ ఆంటీ.. మీరు భయపడకండి. నేను మీ కొడుకును ఎలాంటి ఇబ్బందులకు గురిచేయను. అతడుచేసిన తప్పును గుర్తుచేయడంతోపాటు భవిష్యత్‌లో ఇలాంటి తప్పిదాలకు పాల్పడకుండా బుద్ధి చెప్పడానికే ఈ ఫొటోను ట్వీట్ చేశాను. నాపై దాడికి సంబంధించి ఎవరి మీదా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఎవరైనా ఫిర్యాదు చేయాలని చూసినా అంగీకరించను. కాబట్టి ఆంటీ! ఎలాంటి బెంగ పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండండి అని పేర్కొన్నారు. బల్లవ్ తల్లి రూపాలి గత మూడేండ్ల నుంచి క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అతడి తండ్రి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.

4277
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles