రెండో రౌండ్లో అంకిత


Wed,August 21, 2019 12:34 AM

న్యూయార్క్: ప్రతిష్ఠాత్మక యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో అడుగుపెట్టేందుకు భారత నంబర్‌వన్ టెన్నిస్ ప్లేయర్ అంకితా రైనా ముంగిట చక్కటి అవకాశం నిలిచింది. క్వాలిఫయింగ్ టోర్నీ తొలి రౌండ్‌లో తనకంటే మెరుగైన ప్రత్యర్థిని చిత్తు చేసిన అంకిత.. రెండో రౌండ్‌లో ర్యాంకింగ్‌లో ఎంతో వెనుకబడి ఉన్న ప్రత్యర్థితో తలపడనుంది. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ 194వ ర్యాంకర్ అంకిత 6-1, 1-6, 6-2తో ప్రపంచ 111వ ర్యాంకర్ బొనావెన్టురే (బెల్జియం)పై గెలిచింది. బుధవారం జరుగనున్న రెండో రౌండ్‌లో ప్రపంచ 279వ ర్యాంకర్ డానియా అల్లెర్తోవా (చెక్ రిపబ్లిక్)తో అంకిత తలపడనుంది. ఇప్పటివరకు గ్రాండ్‌స్లామ్ టోర్నీ క్వాలిఫయింగ్ టోర్నీలో అంకిత రెండో రౌండ్ అడ్డంకిని అధిగమించలేకపోయింది. మరోవైపు పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్‌లో రామ్‌కుమార్ రామనాథన్ 5-7, 6-7 (7/9)తో ఫిలిప్పో బాల్డీ (ఇటలీ) చేతిలో ఓటమి పాలయ్యాడు.

84

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles