స్టోక్స్ హీరోచితం


Mon,August 26, 2019 02:14 AM

ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్ గెలుపు ఆసీస్‌కు తీవ్ర నిరాశ
stokes
లండన్ : సంప్రదాయ క్రికెట్‌లో అసలు సిసలు మజాను అందిస్తూ ఉత్కంఠ మధ్య సాగిన యాషెస్ సిరీస్ మూడో టెస్టులో బెన్ స్టోక్స్(219 బంతుల్లో 135 నాటౌట్ ; 11ఫోర్లు, 8సిక్సులు) అద్భుత ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో చివరికి ఇంగ్లండ్ సాధించింది. మ్యాచ్ నాలుగో రోజైన ఆదివారం మ్యాచ్ ఎన్నో మలుపులు తిరగగా 359 పరుగుల లక్ష్యాన్ని ఓ వికెట్ మిగిలుండగా ఇంగ్లిష్ జట్టు ఛేదించింది. టెస్టు క్రికెట్ చరిత్రలో ఆ జట్టుకు ఇదే అత్యధిక లక్ష్యఛేదన. చివరి వికెట్‌కు లీచ్(1నాటౌట్)ను నాన్‌స్ట్రయికింగ్ ఎండ్‌కే పరిమతం చేస్తూ 76 పరుగులు జోడించి.. అద్భుతం చేసి బెన్ స్టోక్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ను అందుకున్నాడు. ఆ ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల యాషెస్ సిరీస్ 1-1తో సమం కాగా నాలుగో మ్యాచ్ వచ్చే నెల 4న ప్రారంభం కానుంది. ఆసీస్ బౌలర్లలో హేజిల్‌వుడ్ 4, లైయాన్ 2వికెట్లు తీశారు.

ఆద్యంతం మలుపులే...

ఓవర్‌నైట్ స్కోరు 156-3తో నాలుగో రోజు ఆటకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. రూట్(77) త్వరగానే ఔట్ కాగా.. ఆ తర్వాతి వికెట్‌కు బెయిర్‌స్టో(36) సాయంతో స్టోక్స్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఐదో వికెట్‌కు 86 పరుగులు జత చేయడంతో చేశాక బెయిర్‌స్టో ఔట్ కాగా, కాసేపటికే బట్లర్(1), వోక్స్(1)ను వెనుదిరిగారు. ఇక ఆర్చర్(15), బ్రాడ్(0) కూడా కాసేపటికే ఔట్‌కాగా, విజయానికి 73 పరుగులు అవసరమైన సమయంలో లీచ్ చివరి బ్యాట్స్‌మన్‌గా స్టోక్స్‌కు జతగా బరిలోకి దిగాడు. స్టోక్స్ క్రమంగా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ మ్యాచ్‌ను ఇంగ్లిష్ జట్టు వైపునకు తిప్పాడు. వ్యక్తిగత స్కోరు 96 ఉన్నప్పుడు వరుసగా ఫోర్, రెండు సిక్సర్లను బాది శతకం చేశాడు. చివరి వరకు లీచ్‌ను నాన్‌స్ట్రయికింగ్ ఎండ్‌కే పరిమితం చేస్తూ 76 పరుగులు జోడించడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ మిగిలుండగా 362 పరుగులు చేసి విజయం సాధించింది. 34, 116 వ్యక్తిగత స్కోర్ల వద్ద స్టోక్స్ ఇచ్చిన క్యాచ్‌లను వార్నర్, మార్కస్ హారిస్ వదిలేశారు.

745

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles