స్టోక్స్‌కు నైట్‌హుడ్ పురస్కారం!


Wed,July 17, 2019 02:30 AM

stokes
లండన్: ప్రపంచకప్ ఫైనల్‌లో అలుపెరుగని పోరాటం చేసి ఇంగ్లండ్‌ను తొలిసారి జగజ్జేతగా నిలిపిన ఆ దేశ ఆల్‌రౌండర్ స్టోక్స్‌కు బ్రిటన్ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన నైట్‌హుడ్ దక్కే అవకాశం ఉంది. థెరిసా మే తర్వాత బ్రిటన్ ప్రధాని పీటం కోసం పోటీ పడుతున్న బోరిస్ జాన్సన్, జెరెమీ హంట్... స్టోక్స్‌కు అవార్డు ఇవ్వడంపై సానుకూలంగా స్పందించారు. దిసన్ అండ్ టాక్ రేడి యో నిర్వహించిన ఓ చర్చలో వారు ఈ అం శంపై స్పందించారు. నైట్‌హుడ్‌కు స్టోక్స్ అర్హుడేనా అన్న ప్రశ్నకు జాన్స న్ సమాధామిస్తూ కచ్చితంగా అర్హు డే. నేనైతే పురస్కారం తప్పక ఇచ్చేందుకు ప్రయత్నిస్తా అని చెప్పారు.

దీనికి మరో అభ్యర్థి హంట్ సైతం మద్దతు తెలిపారు. దీంతో వీరిలో ఎవరు ప్రధాని అయినా బెన్ స్టోక్స్‌కు నైట్‌హుడ్ పురస్కారం దక్కే అవకాశముంది. ఇప్పటివరకు 11 మంది ఇంగ్లండ్ క్రికెటర్లకు మాత్రమే ఈ గౌరవం దక్కింది. నైట్‌హుడ్ పురస్కారాన్ని బ్రిటీష్ రాజు లేదా రాణి ప్రదానం చేస్తారు. మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ చివరిసారి ఈ పురస్కారా న్ని అందుకున్నాడు. బెన్ స్టోక్స్ ఈ విశ్వకప్‌లో 465పరుగులు, ఏడు వికెట్లు తీశాడు. ఫైనల్‌లో ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నా యోధుడిలా పో రాడి 98 బంతులకు 84 పరుగులు చేశాడు. సూపర్ ఓవర్లోనూ ఎనిమిది పరుగులు చేసి ఇంగ్లండ్ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు.

551

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles