మణిందర్ విజృంభణ


Mon,September 23, 2019 01:23 AM

PKL2019

-జైపూర్‌పై 41-40తో బెంగాల్ విజయం

జైపూర్: రైడర్ మణిందర్ సింగ్ విజృంభించడంతో చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో బెంగాల్ వారియర్స్ ఒక్కపాయింట్ తేడాతో జైపూర్ పింక్‌పాంథర్స్‌ను మట్టికరిపించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ 41-40తో ఆతిథ్య జట్టును ఓడించి ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. ఇరు జట్లు రైడింగ్‌లో రాణించగా.. డిఫెన్స్‌లో బెంగాల్ కాస్త ముందంజలో నిలిచింది. బెంగాల్ రైడర్ మణిందర్ సింగ్ (19పాయింట్లు) చెలరేగగా.. జైపూర్ రైడర్ నీలేశ్ సొలంకి (15 పాయింట్లు) కూడా సూపర్-10తో అదరగొట్టాడు. ప్రారంభం నుంచి రెండు జట్లు హోరాహోరీగా తలపడగా.. ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి జైపూర్ 14-13తో స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. ప్రపంజన్ సూపర్ రైడ్‌తో అదరగొట్టడంతో జైపూర్ ఆలౌటైంది. దీంతో వారియర్స్ ఆధిక్యం 20-14కు పెరిగింది. ఓ దశలో 36-26తో మ్యాచ్‌ను సులువుగానే గెలుస్తుందనే స్థితికి వెళ్లింది. ఆ సయయంలో నీలేశ్ సొలంకి సహా జైపూర్ రైడర్లు వరుసగా పాయింట్లు సాధిస్తూ 39-41కి బెంగాల్ ఆధిక్యాన్ని తగ్గించేశారు. చివరి క్షణాల్లో అత్యంత ఉత్కంఠ నెలకొన్న తరుణంలో నీలేశ్ ఓ పాయింట్ సాధించినా.. ఫలితం లేకపోయింది. మరోమ్యాచ్‌లో యు ముంబా 31-25 తేడాతో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌పై గెలిచింది.

401

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles