విండీస్ టూర్‌కు ధోనీ దూరం


Sun,July 21, 2019 02:24 AM

ranbir-dhoni
రెండు నెలల పాటు విరామం.. సైన్యానికి సేవలందిస్తానంటూ సమాచారం!
న్యూఢిల్లీ: భారత సీనియర్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ వార్తలపై వస్తున్న ఊహాగానాలకు ఒకింత తెరపడింది. ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన తర్వాత ధోనీ వీడ్కోలుపై పలువురు విభిన్న అభిప్రాయాలను వ్యక్తపరిచిన సంగతి తెలిసిందే. కొందరు మహీకి మద్దతుగా నిలువగా, రిటైర్మెంట్‌కు సమయం వచ్చిందని ఇక యువ క్రికెటర్లకు అవకాశమివ్వాలంటూ మరికొందరు మాజీలు మాటల తూటాలు పేల్చారు. అయితే వీటన్నంటికీ తెరదించుతూ ధోనీ తనదైన శైలిలో జట్టుకు అవసరముందని భావిస్తూ రానున్న వెస్టిండీస్ పర్యటన నుంచి తప్పుకున్నాడు. రిటైర్మెంట్ వార్తలకు చెక్‌పెడుతూ యువ క్రికెటర్లకు మార్గనిర్దేశం చేయాలనే ఉద్దేశంతో స్వతహాగా తప్పుకునేందుకు ఈ డాషింగ్ బ్యాట్స్‌మన్ సిద్ధమయ్యాడు. రెండు నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉంటానని, ఈ సమయంలో సైన్యంలో సేవలందిస్తానంటూ బీసీసీఐకి సమాచారమిచ్చినట్లు తెలిసింది.

కరీబియన్ పర్యటన కోసం ఆదివారం జట్టును ప్రకటించనున్న నేపథ్యంలో ధోనీ ప్రకటన ఆసక్తి కల్గించింది. మరి మహీ మాటకు విలువిస్తూ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మరికొన్ని గంటల్లో తేలనుంది. మూడు అంశాలపై పూర్తి క్లారిటీ ఇవ్వదల్చుకున్నాం. క్రికెట్ నుంచి ధోనీ రిటైర్ కావడం లేదు. రెండు నెలల పాటు విరామం తీసుకుని పారా మిలటరీ రెజిమెంట్‌లో విధులు నిర్వర్తిస్తానంటూ ఇంతకుముందే తెలియజేశాడు. ఈ విషయాన్ని కెప్టెన్ కోహ్లీ, కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ దృష్టికి తీసుకెళ్తాం అని సీనియర్ బీసీసీఐ అధికారి తెలిపారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం బంతి సెలెక్షన్ కమిటీ కోర్టులో ఉందని, ఎమ్మెస్కే ప్రసాద్ తీసుకునే నిర్ణయంపై ధోనీ భవితవ్యం ఆధారపడి ఉందని బోర్డు అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కమిటీ చైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది.

టీ20 ప్రపంచకప్ పైనే దృష్టంతా

పంత్‌కే ప్రథమ ప్రాధాన్యం

ధోనీ గైర్హాజరీ నేపథ్యంలో రిషబ్ పంత్‌కు తొలి ప్రాధాన్యం దక్కనుంది. విండీస్‌తో జరిగే మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్ట్‌ల కోసం పంత్‌ను తీసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. దీంతో సాహా రిజర్వ్‌కు పరిమితం కానున్నాడు.

338

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles