షమీపై చార్జ్‌షీట్


Fri,March 15, 2019 12:34 AM

shami
కోల్‌కతా: టీమ్‌ఇండియా పేసర్ మహ్మద్ షమీ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. భార్యను వేధించాడన్న ఆరోపణల కేసులో అతనిపై అభియోగాలు నమోదు చేశారు. నాన్‌బెయిలబుల్ నేరాలతో కూడిన చార్జ్‌షీట్‌ను కోల్‌కతా మహిళా గ్రీవెన్ సెల్ పోలీసులు గురువారం అలీపోర్ ఏసీజేఎమ్ కోర్టులో దాఖలు చేశారు. ఐపీసీ సెక్షన్ 498 ఏ (వరకట్న వేధింపులు), 354 ఏ (లైంగిక వేధింపులు) కింద కేసులు పెట్టారు. షమీ సోదరుడు హసీబ్ అహ్మద్ పేరును కూడా ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు. అయితే గతంలో నమోదు చేసిన 307 (హత్యాయత్నం), 376 (లైంగిక దోపిడికి శిక్ష) వంటి నేరపూరిత కఠినమైన సెక్షన్లను పోలీసులు ఉపసంహరించుకున్నారు. దీంతో ఈ కేసులో క్రికెటర్‌కు కాస్త ఊరట కలిగినైట్లెంది. అలాగే తల్లిదండ్రులు, మరదలి పేరును కూడా ఎఫ్‌ఐఆర్ నుంచి తొలగించారు. తన భర్తకు మరొకరితో అక్రమ సంబంధం ఉందని ఆరోపిస్తూ, దానికి సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్లను షమీ భార్య హసీన్ జహాన్ సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రం కావడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.

332

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles