బెయిల్స్ మార్చం: ఐసీసీ


Wed,June 12, 2019 01:00 AM

zing-bails
లండన్: ప్రపంచకప్‌లో తీవ్ర చర్చకు తావిస్తున్న జింగ్ బెయిల్స్‌పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) స్పష్టతనిచ్చింది. మెగాటోర్నీ మధ్యలో ఎలాంటి మార్పులు చేయబోమని.. ఏదేమైనా అందరూ అవి వాడాల్సిందేనని తేల్చి చెప్పింది. గత వరల్డ్‌కప్ నుంచి అన్ని అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఇవే బెయిల్స్ వినియోగిస్తున్నాం. అప్పుడు లేని సమస్య ఇప్పుడే ఎందుకు తలెత్తుతున్నది. అదంతా ఆటలో భాగమే. టోర్నమెంట్ మధ్యలో మార్పులు చేయం. అన్ని జట్లు అదే సరంజామతో ఆడుతున్నాయి అని ఐసీసీ మంగళవారం తెలిపింది. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే పలుమార్లు బంతి వికెట్లను తాకినా బెయిల్స్ పడకపోవడంపై సర్వత్రా చర్చ జరగుతున్నది. లైట్లు వెలిగేందుకు వీలుగా బెయిల్స్ మధ్యలో వైర్లు అమర్చడం వల్ల బరువు పెరిగి బెయిల్స్ పడటం లేదనే అభిప్రాయాలు ఎక్కువవుతున్నాయి. ఆసీస్‌తో మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, కంగారూ సారథి అరోన్ ఫించ్ ఈ అంశంపై ఫిర్యాదు చేశారు.

677

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles