వారెవ్వా.. వార్నర్


Fri,June 14, 2019 02:43 AM

warner
టాంటన్: ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ మైదానంలో తన షాట్లతో పాటు.. గ్రౌండ్ బయట ప్రవర్తనతోనూ అభిమానుల మనసులు గెలుచుకుంటున్నాడు. ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌పై ఆసీస్ విజయం సాధించిన అనంతరం తనకు లభించిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును వార్నర్ ఓ అభిమానికి బహుకరించాడు. మ్యాచ్ అనంతరం అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇస్తున్న వార్నర్ ఆస్ట్రేలియా జెర్సీ వేసుకొని తనకోసం ఎదురుచూస్తున్న ఓ చిన్నారి వద్దకు వెళ్లి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీని బహుమతిగా ఇచ్చేశాడు. మేము మా (ఆస్ట్రేలియా) జెండా ఊపుతున్నాం. అది గుర్తించిన వార్నర్ మా వద్దకు వచ్చి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చి వెళ్లాడుఅని బాలుడు సంతోషంగా అన్నాడు. ఈ వీడియోను ఐసీసీ అధికారిక ట్విట్టర్‌లో పెట్టింది.

777

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles