ఇక్కడా కోహ్లీనే..


Mon,August 19, 2019 03:47 AM

kohli
న్యూఢిల్లీ: పరుగుల వరద పారించడంతో పాటు.. రికార్డులు తిరగరాయడంలో ముందువరుసలో ఉండే విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలోనూ హవా కొనసాగిస్తున్నాడు. సామాజిక మాధ్యమాల్లో సచిన్ టెండూల్కర్, మాజీ సారథి ధోనీని మించి అత్యధిక ఫాలోవర్లు కలిగిన క్రికెటర్‌గా నిలిచాడు. ట్విట్టర్(3.1 కోట్లు), ఫేస్‌బుక్(3.7 కోట్లు), ఇన్‌స్టాగ్రామ్(3.9 కోట్లు)ల్లో మొత్తంగా 9 కోట్లకు పైగా కోహ్లీని ఫాలో అవుతున్నారు. మరో వైపు కెప్టెన్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కనుంది. ఢిల్లీలోని ఫిరాజ్‌షా కోట్ల మైదానంలోని ఓ స్టాండ్‌కు త్వరలో కోహ్లీ స్టాండ్‌గా డీడీసీఏ నామకరణం చేయనుంది.

620

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles