ఫైనల్ రౌండ్‌లో దీప


Fri,March 15, 2019 12:32 AM

బాకు: టోక్యో ఒలింపిక్ బెర్త్‌పై కన్నేసిన భారత టాప్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్.. ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ వరల్డ్‌కప్‌లో సత్తా చాటింది. గురువారం జరిగిన వాల్ట్ విభాగంలో ఫైనల్స్‌కు అర్హత సాధించింది. క్వాలిఫయింగ్ రౌండ్‌లో తొలిసారి అతి క్లిష్టమైన హ్యాండ్‌ఫ్రంట్ 540 వాల్ట్‌ను ప్రదర్శించిన భారత జిమ్నాస్ట్ వరుసగా 14.466, 14.133 పాయింట్లను సాధించింది. 14.299 సగటుతో మూడో స్థానంలో నిలిచి తుది పోరుకు చేరింది. అమెరికా జిమ్నాస్ట్ జేడ్ క్యారీ (14.70), మెక్సికన్ అలెక్సా మోరెనో (14.53) టాప్-2లో నిలిచారు. ఎనిమిది మందితో కూడిన వాల్ట్ ఫైనల్ శనివారం జరుగనుంది. శుక్రవారం జరిగే బ్యాలెన్స్‌డ్ భీమ్‌లో దీప బరిలోకి దిగుతున్నది.

244
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles