ఎలాంటి విభేదాల్లేవు: రవిశాస్త్రి


Wed,September 11, 2019 03:54 AM

ravi
దుబాయ్ : విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాల అంశంపై టీమ్‌ఇండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి ఎట్టకేలకు స్పందించాడు. ఆటగాళ్ల మధ్య భిన్నాభిప్రాయాలను గొడవల్లా చూడకూడదని చెప్పాడు. ఓ వార్తాసంస్థతో శాస్త్రి మంగళవారం మాట్లాడాడు. కెప్టెన్ కోహ్లీ- వైస్ కెప్టెన్ రోహిత్ మధ్య విభేదాలున్నాయన్న ఊహాగానాలను కొట్టిపారేశాడు. 15 మంది ఆటగాళ్లు ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో కొందరి అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయి. ఇది సాధారణం. జట్టుకు కావాల్సింది కూడా అదే. అందరూ ఒకేలా ఆలోచించాలని అనుకోను. ఓ అంశంపై ముందే చర్చించి ఉంటాం. ఆ తర్వాత ఒకరికి కొత్త ఆలోచన తడుతుంది. దాన్ని కూడా ప్రోత్సహించాలి. అందుకే అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం అందరికీ ఇవ్వాలి. ఏది అత్యుత్తమమైనదో నిర్ణయించాలి. జట్టులోకి కొత్తగా వచ్చిన ఆటగాడైనా మేం ఆలోచించని ఓ వ్యూహంతో ముందుకువస్తే దానిపైన కూడా చర్చించాల్సిన అవసరం ఉంటుంది. భిన్నాభిప్రాయాలను గొడవల్లా చూడకూడదు అని రవిశాస్త్రి చెప్పాడు.

కోహ్లీతో నిజంగా విభేదాలు ఉంటే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఐదు శతకాలు చేసేవాడా, వారి మధ్య అన్ని మంచి భాగస్వామ్యాలు ఉండేవా అని ప్రశ్నించాడు. ప్రస్తుతం టీమ్‌ఇండియా అన్ని విభాగాల్లో అద్భుతంగా ఆడుతున్నదని శాస్త్రి ప్రశంసించాడు. రోహిత్‌తో తనకు ఎలాంటి గొడవలు లేవని కరీబియన్ పర్యటనకు వెళ్లే ముందు కెప్టెన్ కోహ్లీ కూడా స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

453

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles