భారత్ ఎ, ఇంగ్లండ్ లయన్స్ మ్యాచ్ డ్రా


Mon,February 11, 2019 02:04 AM

వయనాడ్: భారత్ ఎ, ఇంగ్లండ్ లయన్స్ జట్ల మధ్య నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఓవర్‌నైట్ స్కోరు 20/0తో ఆఖరి రోజు ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 82 ఓవర్లలో 5 వికెట్లకు 214 పరుగులు చేసింది. ఓపెనర్లు బెన్ డకెట్(30), మ్యాక్స్ హోల్డెన్ (29) లయన్స్‌కు మెరుగైన శుభారంభాన్నిచ్చారు. వీరిద్దరు భారత బౌలర్లను సమర్థంగా నిలువరిస్తూ 12 ఓవర్లలో 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. డకెట్‌ను ఔట్ చేయడం ద్వారా ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని అవేశ్‌ఖాన్(1/30) విడదీశాడు. ఆ తర్వాత ఏడు ఓవర్ల తేడాతో హోల్డెన్ కూడా నిష్క్రమించాడు. దీంతో స్యామ్ హేన్(57), ఒలీ పోప్(63) అర్ధసెంచరీలతో జట్టును గట్టెక్కించారు. షాబాజ్ నదీమ్(2/56).. పోప్‌ను ఔట్ చేయడంతో మూడో వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. కెప్టెన్ బిల్లింగ్స్ (5), హేన్ కూడా నిష్క్రమించడం..మ్యాచ్ ఫలితం తేలేలా లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్ల అంగీకారంతో డ్రాకు ఒప్పుకున్నారు. డబుల్ సెంచరీతో రాణించిన ప్రియాంక్ పాంచల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.

378

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles