ఉత్సాహంగా హెచ్‌వైఎస్‌ఈఏ స్పోర్ట్స్ టోర్నీ


Mon,April 15, 2019 02:30 AM

Picture
హైదరాబాద్: ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్ రేంజ్, సింక్రోనీ, సైకుల్ సహకారంతో హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్(హెచ్‌వైఎస్‌ఈఏ) క్రీడా టోర్నీ ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. పోటీలను హెచ్‌వైఎస్‌ఈఏ చీఫ్ అపరేటింగ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, ఫ్రీడమ్ ఆయిల్ సేల్స్ & మార్కెటింగ్ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు ప్రారంభించారు. ఒలింపిక్ ఫార్మాట్ ప్రకారం జరిగిన 5కే రన్‌లో ఆదిత్య విజేతగా నిలువగా, ప్రీతమ్‌కుమార్ సింగ్‌కు రన్నరప్ దక్కింది. 10కే రన్‌లో సురేంద్ర, విజ్ఞాన్ తొలి రెండు స్థానాల్లో నిలిచారు. మారథాన్ రన్‌లో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. పరుగు పందెంతో పాటు మొత్తం 14 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. ఇందులో దాదాపు 1200లకు మంది కి పైగా పాల్గొన్నారు.

273

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles