కృష్ణయ్యకు కృతజ్ఞతలు!


Wed,May 15, 2019 08:30 AM

neetha
ముంబై: రికార్డు స్థాయిలో నాలుగో సారి ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకోవడంతో ముంబై ఇండియన్స్ జట్టులో సంబురాలు అంబురాన్నంటాయి. కప్ గెలిచి సొంతగడ్డపై అడుగుపెట్టిన జట్టుకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ముంబైని ఈయేటి ఐపీఎల్ విజేతగా నిలిపిన జట్టు సభ్యుల కోసం ఫ్రాంచైజీ యజమాని నీతా అంబానీ తమ నివాసం అంటిల్యాలో సోమవారం ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. అయితే విందుకు వెళ్లేముందు ఇష్టదైవమైన శ్రీ కృష్ణుని పాదాల చెంత ఐపీఎల్ ట్రోఫీని ఉంచి నీత తన భక్తిని చాటుకుంది. మందిరంలోకి నీత ప్రవేశించగానే ఒక్కసారిగా జై శ్రీ కృష్ణ అంటూ అక్కడున్న వారు చప్పట్లతో స్వాగతం పలికారు. కప్‌ను దేవుని దగ్గర ఉంచిన నీత కొద్దిసేపు ప్రార్థనలు చేశారు. ఈ వీడియోను భయానీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో బయటికొచ్చింది. జట్టు జెర్సీని ప్రతిబింబించేలా నీతా అంబానీ పార్టీకి అదిరిపోయే డ్రెస్స్‌తో వచ్చారు.

492
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles