బీజేపీలోకి గౌతం గంభీర్


Sat,March 23, 2019 02:18 AM

Gautam

న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. సామాజిక అంశాలపై సోషల్‌మీడియా వేదికగా తనదైన శైలిలో చురుగ్గా స్పందించే గంభీర్ భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరాడు. శుక్రవారం కేంద్ర మంత్రులు అరుణ్‌జైటీ, రవిశంకర్ ప్రసాద్ సమక్షంలో గంభీర్ పార్టీ కండువా కప్పుకున్నాడు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాల్లో ఏదో ఒక దాన్నుంచి ఈ 37 ఏండ్ల మాజీ క్రికెటర్ పోటీచేసే అవకాశమున్నట్లు తెలిసింది. ప్రస్తుతం మీనాక్షి లేఖి ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం నుంచి గంభీర్‌ను దింపే చాన్స్ ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. బీజేపీలో తన చేరికపై మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ విజన్‌కు ఆకర్షితుడనై బీజేపీలో చేరాను. నాకు దక్కిన ఈ అవకాశాన్ని గౌరవంగా భావిస్తున్నాను అని గంభీర్ అన్నాడు. జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కూడా గంభీర్‌ను బీజీపీలోకి ఆహ్వానిస్తూ కండువా కప్పాడు.

581

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles