ఫేస్‌బుక్‌లో లాలిగా మ్యాచ్‌లు


Thu,September 19, 2019 12:57 AM

Jose
హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి : స్పెయిన్‌లో జరిగే ప్రఖ్యాత ఫుట్‌బాల్ టోర్నీ లాలిగా ఈ సీజన్ మ్యాచ్‌లన్నీ ఫేస్‌బుక్‌లో ప్రత్యక్షప్రసారం కానున్నాయి. భారత్‌లోనూ మంచి ఆదరణ ఉన్న టోర్నీని ప్రేక్షకులకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ఫేస్‌బుక్‌లో ఉచితంగా మొత్తం 380మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నామని లా లీగా భారత్ ఎండీ జోస్ ఆంటోనియో తెలిపారు. ఈ మేరకు నగరంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. అత్యాధునిక కెమెరాలు, సాంకేతికత సాయంతో ఈసారి వినూత్నంగా టీవీల్లోనూ ప్రసారమయ్యే లాలిగా మ్యాచ్‌లు వీక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తాయని చెప్పారు. క్రికెట్ తర్వాత భారత్‌లో ఫుట్‌బాల్‌నే టోవీల్లో అధికంగా చూస్తున్నారని ఆంటోనియో తెలిపారు.

194

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles