భారత్, ఆసీస్ మధ్య తొలి డేనైట్ టెస్టు!


Wed,November 6, 2019 12:20 AM

GILCHRIST

-వచ్చే ఏడాది జరగొచ్చని గిల్‌క్రిస్ట్ ఆశాభావం

న్యూఢిల్లీ: టీమ్‌ఇండియా వచ్చే ఏడాది ఆస్ట్రేలియాతో డే అండ్ నైట్ టెస్టు ఆడేందుకు అంగీకరించొచ్చని ఆ దేశ మాజీ ఆటగాడు గిల్‌క్రిస్ట్ ఆశాభావం వ్యక్తంచేశాడు. భార త మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం బంగ్లాతో తొలి పింక్‌బాల్ టెస్టు ఆడేందుకు కోహ్లీసేనను ఒప్పించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది పొట్టి ప్రపంచకప్ అనంతరం భారత్-ఆస్ట్రేలియా మధ్య డే అండ్ నైట్ టెస్టు జరగొచ్చు. దీనికి సంబంధించి క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకున్నా నాకు మాత్రం అలా అనిపిస్తున్నదిఅని గిల్ క్రిస్ట్ అన్నాడు.

పంత్‌ను మరో ధోనీలా చూడొద్దు

భారత యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ ను.. మహేంద్రసింగ్ ధోనీ తో పోల్చొడం సరికాదని గిల్‌క్రిస్ట్ పేర్కొన్నాడు. భారత అభిమానులకు, మీడియా కు నేనో విజ్ఞప్తి చేస్తున్నా.. యువ ఆటగాడిని (పంత్) ధోనీతో పోల్చే ప్రయత్నం కూడా చేయకండి. పంత్‌ను ధోనీ లా తీర్చిదిద్దుదామనుకుంటే అతడు తన సహజ స్వభావాన్ని కోల్పోయే ప్రమాదముం ది. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నా.. ఇదే నేను పంత్‌కు ఇచ్చే సలహాఅని గిల్లీ వివరించాడు.

277

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles