కేపీఎల్‌లో ఫిక్సింగ్ దుమారం


Fri,November 8, 2019 02:57 AM

cm-gautham
ఇద్దరు ఆటగాళ్ల అరెస్టు, ఓ ఫ్రాంచైజీపై నిషేధం
బెంగళూరు : కర్ణాటక ప్రీమియర్ లీగ్(కేపీఎల్)లో ఫిక్సింగ్ బాగోతం మరోసారి దుమా రం రేపింది. స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు అంగీకరించడంతో ఫస్ట్‌క్లాస్ ప్లేయర్లు, కేపీఎల్‌లో బళ్లారి టస్కర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం గౌతమ్, అబ్రార్ ఖాజీని సిటీ సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బెళగావి పాంథర్స్ ఫ్రాంచైజీపై కర్ణాటక క్రికెట్ సంఘం (కేసీఏ) నిషేధం విధించింది. కేపీఎల్‌ల్లో బళ్లారి టస్కర్స్‌కు గౌతమ్ సారథిగా ఉండగా.. ఖాజీ కీలక ఆటగాడిగా వ్యవహిస్తున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో గోవాకు గౌతమ్ , మిజోరాంకు ఖాజీ ప్రాతినిధ్యం వహిస్తుండగా.. వీరిద్దరూ జాతీయ టీ20టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి కూడా ఎంపికయ్యారు.

ఈ ఏడాది కేపీఎల్ ఫైనల్లో హుబ్లీ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గౌతమ్, ఖాజీ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని, స్లోబ్యాటింగ్ చేసేందుకు రూ.20 లక్షలు పుచ్చుకున్నారని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ఫైనల్లో హుబ్లీ టైగర్స్ 8 పరుగుల తేడాతో బళ్లారిపై గెలిచింది. అలాగే బెంగళూరుతో జరిగిన ఓ మ్యాచ్‌లోనూ ఈ ఇద్దరు ఆటగాళ్లు ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు అధికారులు తేల్చారు. గౌతమ్, ఖాజీ ఐపీఎల్‌ల్లోనూ ఆడారు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఉన్న గౌతమ్.. గతంలో ముంబై, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్లకు ఎంపికయ్యాడు. 2011లో ఆర్‌సీబీ తరఫున ఖాజీ ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడా డు. 94 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన గౌతమ్... ఆరోపణల కారణంగా ఈ సీజన్‌లో కర్ణాటకను వీడి గోవా తరఫున ఆడుతున్నాడు. కేపీఎల్‌ల్లో ఫిక్సింగ్ ఆరోపణలతో బెంగళూరు బ్లాస్టర్స్ బౌలింగ్ కోచ్ వినుప్రసాద్, బ్యాట్స్‌మన్ విశ్వనాథన్ గత నెల అరెస్టయిన సంగతి తెలిసిందే.

659

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles