గంభీర్ జయకేతనం..


Fri,May 24, 2019 12:44 AM

gautam-gambhir
న్యూఢిల్లీ: టీమ్‌ఇండియా వరల్డ్‌కప్‌ల హీరో గౌతమ్ గంభీర్ రాజకీయ అరంగేట్రంలోనే అదరగొట్టాడు. లోక్‌సభ ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన గంభీర్ సమీప కాంగ్రెస్ అభ్యర్థి అర్విందర్ సింగ్ లవ్లీపై మూడు లక్షల తొంభై వేల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించాడు. గంభీర్‌కు 6,95,109 ఓట్లు రాగా.. అర్విందర్ సింగ్‌కు 3,04,718 ఓట్లు వచ్చాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఆతిశీ మెర్లీన్ 2,19,156 ఓట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. విజయం అనంతరం గంభీర్.. ఇది లవ్లీకవర్ డ్రైవో.. లేక ఆతిశీపై అద్భుత బ్యాటింగో కాదు. ప్రజలు ఆమోదించిన గంభీర భావజాలం. అద్భుత తీర్పునిచ్చిన ప్రజల ఎంపికను విఫలం కానివ్వంఅని ప్రత్యర్థుల పేర్లతో పాటు తన పేరు కూడా అందులో వచ్చేలా ట్వీట్ చేశాడు. పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన గంభీర్‌కు మాజీ సహచరులు వీవీఎస్ లక్ష్మణ్, హర్భజన్ సింగ్, రైనా తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. దక్షిణ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ ఓటమి పాలయ్యాడు. జైపూర్ రూరల్ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్.. కాంగ్రెస్ పార్టీకి చెందిన డిస్కస్ త్రోయర్ కృష్ణపూనియాపై గెలిచాడు.

652

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles