స్ట్రాస్, బాయ్‌కాట్‌కు నైట్‌హుడ్


Wed,September 11, 2019 03:39 AM

Geoffrey
లండన్ : ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజాలు జెఫ్రీ బాయ్‌కాట్, అండ్రూ స్ట్రాస్‌లను ప్రతిష్ఠాత్మక నైట్‌హుడ్ పురస్కారంతో బ్రిటన్ ప్రభుత్వం గౌరవించింది. దేశం తరఫున క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ, అంకితభావం కనబరిచినందుకు గాను వారికి ఈ విశిష్ట పురస్కారాన్ని అందించింది. ప్రధానిగా థెరిసా మే రాజీనామా చేసిన సమయంలో గౌరవ జాబితాలో వీరికి నైట్‌హుడ్ పురస్కారాన్ని ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. నైట్‌హుడ్ పొందిన దిగ్గజాల జాబితాలోకి సర్ అండ్రూ స్ట్రాస్ చేరడం చాలా సంతోషంగా ఉంది. మైదానంలో అతడి విజయాలు ఒక ఎత్తయితే, బయట అతడు ఓ అద్భుతమైన వ్యక్తి. అలాగే సర్ జెఫ్రీ బాయ్‌కాట్‌కు కూడా హదయపూర్వక శుభాకాంక్షలు అని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సీఈవో టామ్ హారిసన్ అన్నారు.

181
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles