హార్దిక్‌కు శస్త్రచికిత్స


Sun,October 6, 2019 02:02 AM

Hardik
- నాలుగు నెలల విశ్రాంతి
న్యూఢిల్లీ: వెన్నునొప్పితో బాధపడుతున్న టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యకు లండన్‌లో శస్త్రచికిత్స జరిగింది. దీంతో దాదాపు నాలుగు నెలల పాటు అతడు క్రికెట్‌కు దూరం కానున్నాడు. వచ్చే ఏడాది ఐపీఎల్లో బరిలోకి దిగే అవకాశం ఉంది. ‘దక్షిణాఫ్రికాతో చివరి టీ20 (సెప్టెంబర్‌ 22) సందర్భంగా వెన్నునొప్పి ఉందని హార్దిక్‌ చెప్పాడు. బీసీసీఐ వైద్య బృందం.. ఇంగ్లండ్‌లోని స్పెషలిస్టులను సంప్రదించగా సుదీర్ఘ పరిష్కారం కోసం శస్త్రచికిత్స చేయించాలని సూచించారు. అక్టోబర్‌ 2న ఫిజియో యోగేశ్‌ పామర్‌తో కలిసి పాండ్యా.. లండన్‌కు వెళ్లాడు. శస్త్రచికిత్స శుక్రవారం జరిగింది’ అని బీసీసీఐ శనివారం వెల్లడించింది. వీలైనంత త్వరలోనే తాను మళ్లీ మైదానంలో అడుగు పెడతానని హార్దిక్‌ పాండ్యా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ‘సర్జరీ విజయవంతమైంది. నేను కోలుకోవాలని కోరుకున్న అందరికీ కృతజ్ఞతలు. త్వరలోనే తిరిగివస్తా’ అని పాండ్యా పేర్కొన్నాడు. గత ఏడాది సెప్టెంబర్‌లో యూఏఈలో జరిగిన ఆసియా కప్‌లోనే అతడు వెన్నునొప్పితో బాధపడ్డాడు. అయితే ఆ తర్వాత కోలుకున్న హార్దిక్‌ ఐపీఎల్‌, వన్డే ప్రపంచకప్‌ ఆడాడు. గత నెల దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో మరోసారి వెన్నునొప్పి తిరగబెట్టడంతో శస్త్రచికిత్స తప్పలేదు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ప్రధాన ఆల్‌రౌండర్‌గా ఉన్న పాండ్యా దూరం కావడం టీమ్‌ఇండియాకు లోటే. వెన్నునొప్పి కారణంగానే స్టార్‌ పేసర్‌ బుమ్రా కూడా దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు.

683

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles