అనస్, హిమకు స్వర్ణాలు


Mon,August 19, 2019 03:49 AM

anas
న్యూఢిల్లీ: భారత స్టార్ స్ప్రింటర్లు హిమాదాస్, మొహమ్మద్ అనస్ అంతర్జాతీయ స్థాయిలో మరోసారి మెరిశారు. చెక్ రిపబ్లిక్ వేదికగా జరుగుతున్న అథ్లెటిక్స్ ఈవెంట్‌లో వీరిద్దరూ స్వర్ణాలు సాధించారు. మహిళల 300 మీటర్ల విభాగంలో హిమ, పురుషుల 300 మీటర్ల విభాగంలో అనస్ పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. గత నెలలో ఐదు స్వర్ణాలు సాధించి అదరగొట్టిన మన పంచ కల్యాణిహిమ ఆరోసారి కూడా దుమ్మురేపింది. బుల్లెట్ వేగంతో లక్ష్యాన్ని చేరి అందరికంటే ముందు నిలిచింది.

hima
యూరోపియన్ రేసుల్లో భాగంగా జూలై 2 నుంచి ఇప్పటి వరకు హిమ ఆరు బంగారు పతకాలు చేజిక్కించుకోవడం విశేషం. పురుషుల విభాగంలో అనస్ 32.41 సెకన్లలో గమ్యాన్ని చేరి బంగారు పతకం గెలుచుకున్నాడు. కాగా.. వరల్డ్ చాంపియన్‌షిప్ 400 మీటర్ల ఈవెంట్‌కు అనస్ ఇప్పటికే అర్హత పొందగా.. హిమా దాస్ ఇంకా అర్హత సాధించలేదు. సెప్టెంబర్‌లో దో హా వేదికగా జరిగే ఈ టోర్నీ కోసం హిమ కసరత్తులు చేస్తున్నది.

260

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles