హిమాదాస్‌కు ఐదో స్వర్ణం


Sun,July 21, 2019 01:39 AM

పాంచ్ పటాకా
ranbir-hima-das

1) పొంజ్‌నన్ అథ్లెటిక్స్ గ్రాండ్‌ప్రిలో
2) కుంటో అథ్లెటిక్స్ మీట్
3) క్లాడ్నో అథ్లెటిక్స్ మీట్
4) టాబోర్ అథ్లెటిక్స్ మీట్
5) చెక్ రిపబ్లిక్ అథ్లెటిక్స్ మీట్

నోవె మెస్టో(చెక్ రిపబ్లిక్): భారత స్టార్ స్ప్రింటర్ హిమాదాస్ పసిడి పతకాల వేట దిగ్విజయంగా కొనసాగుతున్నది. టోర్నీ ఏదైనా స్వర్ణమే లక్ష్యంగా చెలరేగుతున్న హిమ.. మరోమారు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. నెల రోజుల వ్యవధిలో ఐదో స్వర్ణంతో మెరిసింది. శనివారం జరిగిన మహిళల 400మీటర్ల రేసును ఈ అసోం అథ్లెట్ 52.09 సెకన్లలో ముగించి పసిడి పతకాన్ని ఒడిసిపట్టుకుంది. తన వ్యక్తిగత ప్రదర్శన (50.79సె) కంటే తక్కువైనా..వరల్డ్ చాంపియన్‌షిప్ అర్హత మార్క్(51.80సె) అందుకోవడంలో హిమా సఫలం కాలేకపోయింది. గత ఏప్రిల్‌లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 400మీటర్ల ఈవెంటులో నిరాశపరిచిన తర్వాత ఈ విభాగంలో దాస్‌కు ఇదే తొలి పతకం. మరోవైపు పురుషుల 400మీటర్ల హార్డిల్ రేసులో ఎంపీ జబీర్ 49.66 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణం సాధించాడు. 200మీటర్ల రేసులో మహ్మద్ అనస్(20.95సె) కాంస్యం అందుకున్నాడు.

381

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles