ఈనెల 24న హైదరాబాద్ 10కే రన్


Sat,November 9, 2019 12:01 AM

10k-run
హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: హైదరాబాద్ 10కే రన్‌కు సమయం ఆసన్నమైంది. ప్రతి ఏడాదిలాగే ఈసారి నవంబర్ ఆఖరి ఆదివారం 24వ తేదీన ఫ్రీడమ్ హైదరాబాద్ 10కే రన్ జరుగనుంది. ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన కార్యక్రమంలో రన్‌కు సంబంధించిన టీషర్ట్స్, పతకాలు, కప్‌లను నిర్వాహకులు ఆవిష్కరించారు. రేస్ డైరెక్టర్ మురళీ నన్నపనేని, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఫ్రీడమ్ ఆయిల్స్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి, ప్రముఖ నిర్మాత డీ సురేశ్ బాబు, ఈవెంట్స్ నౌ సీఈవో రాజ్ పాకాల, యువ హీరో నిఖిల్ తదితరులు ఇందులో పాల్గొన్నారు.

మై సిటీ మై రన్ రన్ టు బీ ఫ్రీ నినాదంతో ముందుకు రాబోతున్న హైదరాబాద్ రన్‌లో ఈసారి అందరినీ భాగస్వామ్యులను చేయబోతున్నారు. ఆరోగ్యం, ఫిట్‌నెస్ అంశాలను అన్ని వర్గాల ప్రజల్లోకి తీసుకుపోయేందుకు రేసును ఐదు భాగాలుగా విభజించారు. ఈ ఏడాది 17వ ఎడిషన్‌గా రాబోతున్న రేసులో ప్రొఫెషనల్ రేసర్ల కోసం ఎలైట్ 10కే రన్‌కు తోడు ఓపెన్ 10కే రన్(టైమింగ్ చిప్), ఓపెన్ 5కే రన్, షీ, ఫ్యామిలీ రన్‌గా నిర్వహించనున్నారు. మహిళల కోసం కొత్తగా ఈసారి 5కే రన్‌ను తీసుకురాగా, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. 16వేల మంది పాల్గొనే రన్‌కు అందరి మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నట్లు మురళీ అన్నారు.

145

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles