హెచ్‌సీఏ ఎన్నికల షెడ్యూల్ విడుదల


Tue,September 10, 2019 12:36 AM

హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఎన్నికల షెడ్యూల్ సోమవారం విడుదలైంది. మాజీ సీఈసీ, హెచ్‌సీఏ ఎన్నికల అధికారి వీఎస్ సంపత్ ఎన్నికల తేదీలను ప్రకటించారు. జూలై 21న జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎమ్)లో ఆమోదం పొందిన హెచ్‌సీఏ గుర్తింపు క్రికెట్ క్లబ్‌లు, వాటి పేర్లను హైదరాబాద్ క్రికెట్ వెట్‌సైట్‌లో పొందుపరిచారు. ఇందులో ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటే ఈనెల 16 వరకు చేసుకోవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు. తుది జాబితా ఆధారంగా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి పదవులకు అభ్యర్థులు పోటీపడవచ్చు. ఈనెల 17నుంచి 20 వరకు అర్హత గల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. 21న నామినేషన్ల స్క్రూటినీ, 23వ నామినేషన్ల ఉపసంహరణ, బరిలో ఉన్న అభ్యర్థుల నామినేషన్లను బట్టి 27న ఎన్నికలు జరుగుతాయి. పోలింగ్ ముగిసిన తర్వాత ఎన్నికల ఫలితాలను వెలువరించనున్నారు. బీసీసీఐ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 28 తేదీలోగా రాష్ట్ర క్రికెట్ సంఘాలు ఎన్నికల ప్రక్రియను ముగించుకోవాలని సీవోఏ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హెచ్‌సీఏలో ఎన్నికల కోలాహలం మొదలుకాబోతున్నది.

281
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles